రాజ్ తరుణ్‌తో డేటింగా..?అంత లేదు మేమిద్దరం స్నేహితులమే: హెబ్బా పటేల్

రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాలో నటించిన హెబ్బా పటేల్‌.. ఇటీవల మిస్టర్ సినిమాలో నటించింది. మళ్లీ రాజ్ తరుణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయింది. రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ హ

Webdunia
బుధవారం, 3 మే 2017 (12:48 IST)
రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాలో నటించిన హెబ్బా పటేల్‌.. ఇటీవల మిస్టర్ సినిమాలో నటించింది. మళ్లీ రాజ్ తరుణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయింది. రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ హిట్ కావడంతో.. అదే కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సినిమా పేరు అంధగాడు. అంధగాడు సినిమాలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్ర ప్రసాద్ నటించారు. వెలిగొండ్ల శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 
 
ఈ నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్‌తో హెబ్బా పటేల్ డేటింగ్ చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి కూడా అయిపోయిందని ఫిలిమ్ నగర్ జనం చెవులు కొరుక్కున్నారు. ఈ వార్తలపై హెబ్బా పటేల్ స్పందించింది. హీరో తరుణ్‌తో తనకు ఏదో సంబంధం ఉందనే వార్తల్లో నిజం లేదని తేల్చేసింది.
 
తరుణ్‌తో తనకు ఎఫైర్ వుందన్న వార్తలు పుకార్లు మాత్రమేనని హీరోయిన్ హెబ్బా పటేల్ స్పష్టం చేసింది. రెండు, మూడు సినిమాల్లో కలసి నటించినంత మాత్రాన తామిద్దరి మధ్య ఏదో ఉన్నట్టేనా అని ప్రశ్నించింది. మా మధ్య ఏదో గొడవ జరిగిందని కూడా పుకార్లు వచ్చాయని... అది కూడా తప్పేనని చెప్పింది. తామిద్దరం మంచి స్నేహితులమని హెబ్బా పటేల్ స్పందించింది. 
 
అయితే గతంలో ఓ వ్యక్తితో మాత్రం డేటింగ్ చేశానని హెబ్బా ఓపెన్‌గా చెప్పేసింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలుసునని బాంబు పేల్చింది. ఆ వ్యక్తి రాజ్ తరుణ్ అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం మాట మార్చేసింది.. రాజ్ తరుణ్ స్నేహితుడేనని స్పష్టం చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments