నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి కుటుంబంలోని వ్యక్తి. నందమూరి హరిక్రిష్ణ కుమారుడు. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారకరామారావు పేరుతోనే నందమూరి కుటుంబం మొత్తం ఏవిధంగా అయితే సినీ రంగంలోకి వచ్చారో.. అదేవిధంగా కళ్యాణ్ రామ్ కూడా వచ్చారు. కానీ ఆయన న
నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి కుటుంబంలోని వ్యక్తి. నందమూరి హరిక్రిష్ణ కుమారుడు. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారకరామారావు పేరుతోనే నందమూరి కుటుంబం మొత్తం ఏవిధంగా అయితే సినీ రంగంలోకి వచ్చారో.. అదేవిధంగా కళ్యాణ్ రామ్ కూడా వచ్చారు. కానీ ఆయన నటించిన సినిమాల్లో పెద్దగా హిట్లు లేవు. ఒకటి, రెండు ఏవరేజ్‌గా ఆడాయి తప్ప పెద్దగా ఆడిన సినిమాలు లేవన్న విషయం తెలిసిందే.
సినిమా అవకాశాలు రాకపోయినా తమ సొంత బ్యానర్ పైన సినిమాలు తీసుకుంటూ ఉండిపోయారు కళ్యాణ్ రామ్. తనే హీరోగా తమ బ్యానర్లో సినిమాలు తీసి ఆ సినిమాలు కాస్తా ఫెయిల్ కూడా అయిపోయాయి. కళ్యాణ్ రామ్ కారణంగా భారీగా నష్టాలే వచ్చాయి. దీంతో హరిక్రిష్ణ కళ్యాణ్ రామ్‌కు క్లాస్ పీకారట. మన బ్యానర్లో సినిమాలు చేసి అవికాస్త ఆడకపోగా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నామని, సినిమాలు తీయడం ఇక మానేయమన్నారట.
తండ్రి చెప్పిన మాటను జవదాటని కళ్యాణ్ రామ్ సినిమాలు తీయడానికి సిద్ధంగా లేకున్నా ఆయన్ను హీరోగా పెట్టి వేరే నిర్మాతలు సినిమాలు తీయడం లేదట. దీంతో కళ్యాణ్ రామ్ చేతుల్లో పెద్దగా సినిమాలు లేకపోగా ఆయన ప్రస్తుతం ఖాళీగా తిరుగుతున్నారట. కానీ కళ్యాణ్ తమ్ముడు జూనియర్ ఎన్.టి.ఆర్.మాత్రం తన చేతిలో కావాల్సినన్ని సినిమాలు పెట్టుకుని ఎప్పుడూ బిజీగా తిరుగుతుండటం మాత్రం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.