Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రియ.. శివగామికి పోటీనా..? అనుష్క, నయన వద్దనుకుంటే వశిష్టిదేవిగా..?

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వశిష్టిదేవిగా.. శాతకర్ణి భార్యగా శ్రియ నటిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (16:20 IST)
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వశిష్టిదేవిగా.. శాతకర్ణి భార్యగా శ్రియ నటిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ డీ గ్లామరస్ రోల్‌గా ఒక బిడ్డకు తల్లిగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రియ పుట్టిన రోజును పురస్కరించుకుని వశిష్టిదేవి రోల్‌లో శ్రియ ఎలా వుందనే ఫోటోలను రిలీజ్ చేసింది సినీ యూనిట్. 
 
ఈ  ఫోటోలను చూసి వశిష్టి దేవి శివగామి పోటీ అవుతుందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ప్రపంచ సినీ జనాన్ని టాలీవుడ్ వైపు తిప్పిన బాహుబలి శివగామితో వశిష్టిదేవి పోటీనా అంటూ కొందరు అభిప్రాయపడుతుంటే.. వశిష్టిదేవి రోల్‌కు శ్రియ బాగా కుదిరిపోయిందని మరికొందరు అంటున్నారు. తద్వారా శ్రియ నటనలోని సరికొత్త కోణాన్ని క్రిష్ ఆవిష్కరించే ప్రయత్నించాడు. తొలుత ఆ పాత్ర కోసం ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించినా.. ఎన్నో కసరత్తులు చేసి చివరకు శ్రియనే ఎంచుకున్నాడట క్రిష్. బాహుబలిలో శివగామికి ధీటుగా శాతకర్ణిలో వశిష్టిదేవి పాత్ర ఉంటుందని సినీ యూనిట్ అంటోంది. 
 
కానీ శ్రియకు వశిష్టిదేవి రోల్ దక్కేందుకు కారణం అనుష్క, నయనతార అని అంటున్నారు ఫిలిమ్ నగర్ జనం. చిరంజీవి 150వ సినిమాకు ఎలా హీరోయిన్లను వెతికారో.. బాలయ్య సినిమాకు అలానే హీరోయిన్ల కోసం పాకులాడారని.. సీనియర్ హీరోయన్లు అనుష్క, నయనతార వశిష్టిదేవి రోల్ వద్దనుకోవడంతోనే శ్రియకు ఆ ఛాన్స్ దక్కిందంటున్నారు. 
 
ఎందుకంటే అందులో డీ గ్లామర్ రోల్‌లో శ్రియ కనిపించాలని, ఓ బిడ్డకు తల్లిగా కనిపించాలని చెప్పడంతో అనుష్క, నయన ఆ సినిమా వద్దనుకున్నారని.. ఆ టైమ్‌లో అవకాశాల్లేక ఖాళీగా కూర్చున్న శ్రియ అందుకు ఎగిరిగంతేస్తూ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మొత్తానికి వశిష్టిదేవి రోల్‌లో శ్రియ తన సత్తా ఏంటో నిరూపించుకుంటుందో.. లేక సినీ జనం నోట్లో మళ్ళీ నానుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments