Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల ఆరబోతతో తగ్గేదేలే అంటోన్న సమంత.. కోలీవుడ్ సినిమాలో..?

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (11:45 IST)
ఫ్యామిలీ మెన్‌‌ సినిమాలో బోల్డ్ యాక్టింగ్‌తో సమంత లైఫ్ మీదకు తెచ్చుకుందని.. అందుకే సమంత-చైతూల మధ్య దూరం పెరిగిందని.. తద్వారా విడాకులు పుచ్చుకున్నారని టాక్ వస్తోంది. అయితే విడాకుల తర్వాత సమంత... తగ్గేదేలే అంటూ వరుసగా సినిమాలపై సినిమాలు చేస్తూ బిజీగా మారింది. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత సినిమాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు.
 
ఇటీవలే విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ పుష్పలో సమంత ఐటెం సాంగ్‌తో చేసిన అందాల ప్రదర్శన గురించి అందరికీ తెలిసిందే, అటు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో కూడా సమంత బోల్డ్ షో పై అందరూ చర్చించుకున్నారు.
 
అయితే తాజాగా మరోసారి సమంత అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది. ఊ అంటావా అంటూ పుష్పతో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసిన సమంత పుష్ప 2లో కూడా మరో ఐటెం సాంగ్ చేస్తుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. 
 
అలాగే త్వరలో రాబోతున్న తమిళ మల్టీ స్టారర్ మూవీ కాతువాకుల రెండు కాదల్ సినిమా లో కూడా సమంత అందాల ఆరబోత పీక్స్ లో ఉంటుందని సమాచారం.
 
తాజాగా విడుదలైన పోస్టర్‌లో నయనతార పద్దతైన చీర కట్టులో కనిపిస్తూ ఉండగా సమంత మాత్రం చాలా మోడ్రన్ డ్రెస్సులో అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
 
విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ను ప్రేమిస్తాడు. అందులో చివరికి ఎవరితో ఆయన సెటిల్ అవుతాడు అనేది సినిమా కథ. నయనతార ప్రియుడు అయిన విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈనెల 28న ఈ సినిమాను తమిళంలో రిలీజ్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూఎస్ ఎన్నికలు 2024: ట్రంప్, హారిస్‌లలో ఎవరిది ముందంజ? సర్వేలు ఏం చెబుతున్నాయి?

అసలు వెన్నెముక ఉందా లేదా? సూర్య నమస్కారాలు వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర (video)

సీఐడీ చేతికి కాదంబరి జెత్వాని కేసు.. దర్యాప్తు పునః ప్రారంభం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా బి.ఆర్.నాయుడు

తల్లికి ఉరేసింది.. ఆపై ఉరేసుకుంది.. అమ్మ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

వరల్డ్ స్ట్రోక్ డే 2024: తెలంగాణలో పెరుగుతున్న స్ట్రోక్ సంఘటనలు, అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments