యువరత్న, నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. క్రిష్ దర్శకుడు. శ్రియ హీరోయిన్. బాలీవుడ్ సుందరాంగి హేమమాలిని కీలక పాత్రధారి. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైనమెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డిలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు. త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అంశంపై నిర్మాతలు మాట్లాడుతూ 'తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వంద ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డిసెంబర్ మొదటివారంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించి జనవరి 12న సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు.