Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017 సంక్రాంతి 12న ''గౌతమీపుత్ర శాతకర్ణి'' విడుదల

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:15 IST)
నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 100వ చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష హీరోయిన్‌గా నటించబోతుంది. క్రిష్ తెరకెక్కించనున్న ఈ చారిత్రక సినిమాలో నటీనటులతో పాటు, సాంకేతికంగానూ ఈ సినిమాని వైవిధ్యభరితంగా చూపేందుకు దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దర్శకుడు క్రిష్ బాలకృష్ణలు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. 
 
ఈ చిత్రం కోసం బాలయ్య భారీగా కసరత్తులు మొదలెట్టాడు. బాలయ్య తల్లిగా బాలీవుడ్ నటి హేమమాలినిని ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ చిత్ర యూనిట్ ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్‌ని మొరాకో‌లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మొదటి షెడ్యూల్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కాబోతుంది. 
 
ఈ చిత్రంలో నటీనటులను చాలావరకు బాలీవుడ్ వాళ్ళని తీసుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం క్రిష్ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. మరోవైపు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చడంలో ముమ్మరంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా 2017, జనవరి 12న రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments