Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్‌తో గౌతమి బ్రేకప్‌కు నరేంద్ర మోడీ కారణమా? బీజేపీ తీర్థం పుచ్చుకుంటుందా?

సినీ లెజెండ్ కమల్ హాసన్‌కు బ్రేకప్ ఇచ్చేందుకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సినీ నటి గౌతమి భేటీ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్, గౌతమిల బ్రేకపే ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలో హాట్

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (16:29 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్‌కు బ్రేకప్ ఇచ్చేందుకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సినీ నటి గౌతమి భేటీ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్, గౌతమిల బ్రేకపే ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 13 సంవత్సరాల పాటు సహజీవనం చేసిన ఈ జంట విడిపోయేందుకు గల కారణాలపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ నుంచి దూరమయ్యేందుకు కొన్ని రోజుల క్రితం గౌతమి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీకి కమల్‌తో కాకుండా ఒంటరిగా వెళ్ళిన గౌతమి.. తాను బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోడీతో వెల్లడించినట్లు తెలిసింది. గౌతమికి వివాహమైనప్పుడు గౌతమి బీజేపీలో కొంతకాలం పనిచేశారు. ఆపై కమల్‌ హాసన్‌తో సహజీవనం చేశాక.. బీజేపీకి గౌతమి దూరమయ్యారు. 
 
అయితే కమల్ హాసన్‌ నుంచి దూరమయ్యాక తిరిగి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అందుకే మోడీని ఆమె కలిశారని సమాచారం. బీజేపీకి తమిళనాడులో క్రేజ్ అంతగా లేకపోవడంతో గౌతమిని బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
మోడీని కలవడం, బీజేపీలో చేరడం కమల్ హాసన్‌కు ఇష్టం లేదని కూడా కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే కమల్ గౌతమికి దూరమైనట్లు సమాచారం. కమల్‌కు రాజకీయాలంటే పడవని.. గౌతమి రాజకీయాల్లోకి అడుగెట్టడం ఆయనకు నచ్చకపోవడంతోనే ఆమెతో బ్రేకప్ చేసినట్లు తెలుస్తోంది.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments