Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లూరి సీతారామరాజుగా ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్?

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో బిగ్గేస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. ఈ సినిమా అప్పట్లో రిలీజై టాలీవుడ్‌ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ''అల్లూరి సీతారామ రాజు''ను తలపించేలా సినిమాలో ఆయన

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (09:15 IST)
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో బిగ్గేస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. ఈ సినిమా అప్పట్లో రిలీజై టాలీవుడ్‌ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ''అల్లూరి సీతారామ రాజు''ను తలపించేలా సినిమాలో ఆయన చేసిన నటన ఇప్పటికి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. అంతేకాదు సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ఆ సినిమా అంటే మహేష్‌బాబుకు ప్రాణం. ఈ విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. 
 
అల్లూరి సీతారామ రాజు అంటే మహేష్‌బాబుకు ఎంతో ఇష్టం కూడా. కాని ఆ పాత్రలో నటించే సాహసాన్ని మాత్రం మహేష్‌బాబు ఇంతవరకు చేయలేదు. అల్లూరి పాత్రలో నటించమని పలువురు దర్శకులు మహేష్‌బాబుని సంప్రదించినా కూడా ఆయన ఒప్పుకోలేదు. అయితే తన కలను తన కొడుకుతో నెరవేర్చుకునేందుకు మహేష్‌బాబు ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
నడిమింటి నరసింగరావు అనే రచయిత ఈ కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాట యోధుడిగా మారడానికి బాల్యంలో ఎటువంటి సంఘటనలు ప్రభావితం చేశాయనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో గౌతం '1 నేనొక్కడినే' సినిమా ద్వారా బాలనటుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా గౌతమ్‌ను పూర్తిస్థాయి బాలనటుడిగా చూడొచ్చని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments