Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరో కాబోతున్నాడట.. నిర్మాత ఎవరో తెలుసా?

మైనింగ్ కింగ్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరో కానున్నాడట. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె వివాహం ఆహ్వానం పలికేందుకు ఓ వీడియోను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో గాల

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (10:05 IST)
మైనింగ్ కింగ్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరో కానున్నాడట. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె వివాహం ఆహ్వానం పలికేందుకు ఓ వీడియోను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో గాలి జనార్ధన్ రెడ్డి, ఆమె సతీమణి, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు కనిపించి అద్భుతంగా ఆహ్వానం పలికారు. పెళ్ళికూడా ఎంతో అంగరంగ వైభవంగా చేశారు.  
 
గాలి జైలుకెళ్లోచ్చిన తర్వాత కూడా కూతురు పెళ్లి సూపర్ రేంజ్‌లో చేశారు. తన కుమార్తె పెళ్లిని అట్టహాసంగా నిర్వహించిన గాలి జనార్ధన్ రెడ్డి.. తన కుమారుడి భవితవ్యంపై దృష్టి పెట్టారు. తన కొడుకు కిరీటి రెడ్డికి సినిమాల్లో నటింపజేయాలని గాలి ఉవ్విళ్లూరుతున్నారు. 
 
తన కుమార్తె పెళ్లికి గాలి కొడుకు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. సినిమాలో నటించేందుకు కిరీటి రెడ్డి కూడా ఆసక్తి చూపడంతో.. మంచి దర్శకుడితో అతనిని వెండితెరపై చూపించాలని గాలి అనుకుంటున్నారు. వచ్చే ఏడాదికే తన కొడుకును ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేస్తూ గాలి జనార్ధన్ రెడ్డి సినిమాను నిర్మించనున్నారని టాక్ వస్తోంది. ఈ గ్యాప్‌లో కిరీటి కూడా నటనలో మంచి శిక్షణ పొందడానికి ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments