Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితం చేజేతులా నాశనం చేసుకున్నా : మనీషా కోయిరాలా

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెండ్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా. ప్రస్తుతం కేన్సర్ బారి నుంచి కోలుకుని ముంబైలో నివశిస్తూ... సినిమాల్లో రెం

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (10:32 IST)
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెండ్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా. ప్రస్తుతం కేన్సర్ బారి నుంచి కోలుకుని ముంబైలో నివశిస్తూ... సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దీనిపై ఆమె స్పందిస్తూ... 
 
తన పెళ్లి ఫెయిల్ అవడానికి కారణం తానేనని చెప్పింది. తన భర్త సమ్రాట్‌ను ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో, అతని అభిరుచులు నచ్చి 2010లో వివాహం చేసుకున్నానని చెప్పింది. వివాహం గురించి ఎన్నో కలలు కన్నానని తెలిపింది. కానీ, ఆ కలలన్నీపగటి కలలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేసింది. 
 
అదేసమయంలో వైవాహిక అనుబంధం సరైనది కానప్పుడు విడిపోవడమే మంచిదని భావించానని, అందుకే 2012లో విడాకులు తీసుకున్నానని తెలిపింది. అయితే ఇందులో తన భర్త తప్పు ఏమాత్రం లేదని తెలిపింది. తప్పంతా తనదేనని స్పష్టం చేసింది. కాగా, మనీషా పూటుగా తాగి పలు సందర్భాల్లో తూలుతూ మీడియా కంటబడిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments