Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమారంగంలోకి విదేశీ పెట్టుబడులు - కథలూ మారుతున్నాయ్

డీవీ
మంగళవారం, 12 నవంబరు 2024 (15:46 IST)
Indian cinema
దేశ ప్రభుత్వాలే తమ దేశంలో పెట్టుబడులు పెట్టండి, మీకు కావాల్సిన బెనిఫిట్లు తీసుకోండనే నినాదంతో విదేశీయులను ఆకర్షించడం చూస్తూనే వున్నాం. దానివల్ల పదిమంది పనికలుగుతుందని ప్రభుత్వాలే లెక్కలేస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఇండియన్ సినిమానే ముందుకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వందలకోట్లు, వేల కోట్లతో అగ్రహీరోలతో సినిమాలు తీయడం జరుగుతూనే వుంది. పేరుకు ఆయా సినిమారంగంలోని ప్రముఖ నిర్మాత, బేనర్ పేరు వుంటుంది. కానీ పెట్టుబడులు అన్నీ విదేశీయులనుంచే జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు నివేదిస్తున్నాయి.
 
ఇందుకు ప్రధాన సాక్షంగా కథల ఎంపిక కళ్ళకు కనిపిస్తుంది. దాదాపు ఈమధ్య వస్తున్న సినిమాల కథలన్నీ అమెరికా, పోలెండ్, రష్యా ఇతర దేశాల నేపథ్యంలో సాగుతాయి. ఫైనల్ గా ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరిస్తుండడం జరుగుతుంది. అందుకు ప్రభుత్వ రాయితీలే ప్రధాన కారణంగా ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. దానికి తోడు తెలుగు సినిమాల్లో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తుంది. కనీసం సినిమా టైటిల్స్ కూడా తెలుగులో పెట్టకుండా ఆంగ్లంలో పెడుతుంటారు. దీనిపై ఛాంబర్ లో చర్చ జరిగింది. కానీ సినిమా మార్కెట్ గ్లోబల్ కావడంతో ఆంగ్లంలో తప్పనిసరి అని అగ్ర నిర్మాతలంతా ముక్తకంఠంతో వాదించడం కూడా జరిగింది.
 
గతంలో టాలీవుడ్  నిర్మాతలు కొందరు తీస్తే అందుకు ఇండియాలోని పెద్ద బాగ్ షాట్స్ అయిన రిలయన్స్, సోనీ ఇతరత్రా కంపెనీలు వాటాదారులుగా వుంటూ సినిమాలు తీసేవారు. అప్పట్లో మోహన్ బాబు బేనర్ తో కలిసి రియలెన్స్ సంస్థ సినిమా తీసింది. అనంతరం పలు సినిమాలు ఇతర కంపెనీలతో వాటాదారులుగా వుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా సినిమా రూపు రేఖలు మారిపోవడంతో విదేశీయులు పెట్టబడులతో ఎన్.ఆర్.ఐ. సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందుకు ఆయా నిర్మాతలు విదేశీ పర్యటన చేసినప్పుడు ఒప్పందాలు కుదుర్చకునేవారని తెలుస్తోంది.
 
దర్శకుడు వి.ఎన్. ఆదిత్య విదేశీ సినిమాలు తీస్తూ, అక్కడి నటీనటులు, సాంకేతిక సిబ్బందితో సినిమాలు చేయడం జరుగుతుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఈమధ్య ఎక్కువగా విదేశీ సాంకేతిక సిబ్బంది, గ్రాఫిక్స్, విజువల్ వర్క్ లు బాగా జరుగుతున్నాయి. దాంతో ఓవర్ సీస్ మార్కెట్ ను ద్రుష్టిలో పెట్టుకునే చేస్తున్న సినిమాలపై వందల కోట్ల పెట్టుబడులు ఇండియాకు తరలి వస్తున్నాయి.
 
తాజాగా రాజమౌళి, మహేష్ బాబు సినిమా వేలకోట్ల రూపాయలతో తీయనున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. పైగా అది హాలీవుడ్ నేపథ్యంతో రూపొందుతోన్న కథ అని రచయిత విజయేంద్రప్రసాద్ ఇదివరకే ప్రకటించాడు. ఇప్పుడు వారిని తలదన్నే విధంగా దిల్ రాజు ఏకంగా విదేశీపెట్టుబడులతో సినిమాలు తీయడానికి కొత్త బేనర్ ను స్థాపించారు. దానికి ఆయన పేరుతోనే దిల్ రాజు డ్రీమ్స్ అనే బేనర్ ను స్థాపించారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ టీజర్ కోసం చెన్నై వెళ్ళిన దిల్ రాజు అక్కడ తమిళ సినిమాలు కూడా నిర్మిస్తాననీ, అందుకు అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజమైన శ్రీరామ్ ఆదిత్యతో చేతులు కలిపారు. ఇప్పుడు పెట్టుబడులు ఇండియా బోర్డర్ ను దాటాయి. 
 
సో.. దిల్ రాజు మాటల్లో వినాలంటే..  కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ఏర్పాటు చేశాం.   త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నాం. కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు దిల్ రాజు టీంను అప్రోచ్ అవ్వొచ్చు. ఈ మేరకు ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నాం. ఆ వెబ్ సైట్ ద్వారా మీ కంటెంట్ మా టీంకు చేరుతుంది. వారంలో ఒక రోజు నేను ఈ టీం తెచ్చిన స్క్రిప్ట్‌లను వింటాను.
 
ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రెండు ప్రాజెక్టులను చేస్తున్నారు. కొత్త వాళ్లందరికీ ఇదొక ఫ్లాట్ ఫాంగా ఉండాలని అనుకుంటున్నాను. స్క్రిప్ట్ స్థాయిలోనే మీడియా వాళ్ల సహాయం తీసుకోవాలని అనుకుంటున్నాం అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments