ప్రేమలో... సాయిపల్లవి...?!

అరె. గప్‌చుప్‌గా కూర్చోవయ్యా.... ఒకే ఒక్క సినిమా.. అందం లేకున్నా హావభావాలతోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సాయి పల్లవి. ఈ మలయాళ భామ నటించింది మూడు సినిమాలే అయినా పేరు ప్రఖ్యాతులు మాత్రం బాగానే సంపాదించుకుంది. సాయిపల్లవిని అభిమానించే వారికన్నా ప్రే

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (12:51 IST)
అరె. గప్‌చుప్‌గా కూర్చోవయ్యా.... ఒకే ఒక్క సినిమా.. అందం లేకున్నా హావభావాలతోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సాయి పల్లవి. ఈ మలయాళ భామ నటించింది మూడు సినిమాలే అయినా పేరు ప్రఖ్యాతులు మాత్రం బాగానే సంపాదించుకుంది. సాయిపల్లవిని అభిమానించే వారికన్నా ప్రేమించే వారే ప్రస్తుతం ఎక్కువగా ఉన్నారు. తెలుగులో నటించిన ఫిదా సినిమాలో మేకప్ లేకుండా నటించిన ఈ మలయాళ భామ ప్రేక్షకులను ఎంతగానో నచ్చేలా చేసింది.
 
అలాంటి సాయిపల్లవి ప్రేమలో పడిందట. అది కూడా ఫిదా హీరోతో. ఆయనేనండి వరుణ్‌ తేజ్. మొదట్లో వరుణ్‌ భారీ ఆకారంతో సినిమాల్లో నటించారు. ఫిదా సినిమాలో స్లిమ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్యారెక్టర్ తగ్గట్టు తన శరీరాన్ని మార్చుకున్నారు వరుణ్‌. ఫిదా సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, సినిమా హిట్టయిన తరువాత ప్రస్తుతం ప్రేక్షకులను కలిసేందుకు వెళుతున్న సమయంలో వీరు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండడం లేదని ఆ సినిమా టీమే చెవులు కొరుక్కుంటోంది. 
 
సినీనటుల మధ్య చిగురించే ప్రేమలు గురించి తెలిసిందే. వీరిది గాఢ ప్రేమా... లేకుంటే అట్రాక్షనా... లేకుంటే సినీ ప్రేమా... అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. గతంలో కూడా ఇలాంటి ప్రేమలు పుట్టడం మధ్యలోనే విడిపోవడం ఎన్నో చూశాం. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలాంటిదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments