ఛార్మీపై చేయి వేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్.. అసహనంతో సిట్ అధికారులతో ఫిర్యాదు

కారు దిగి సిట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్ తనపై చేయి వేశాడని సిట్ అధికారులతో ఆమె ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో ఛార్మి బుధవారం విచారణకు హాజరైంది. ఆమె సిట్ కార్యాలయానికి వచ్చినప

Webdunia
బుధవారం, 26 జులై 2017 (14:07 IST)
కారు దిగి సిట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్ తనపై చేయి వేశాడని సిట్ అధికారులతో ఆమె ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో ఛార్మి బుధవారం విచారణకు హాజరైంది. ఆమె సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు పోలీసుల్ చేసిన హైడ్రామాపై సిట్ అధికారులకు ఛార్మీ ఫిర్యాదు చేసింది.
 
చార్మీ కారు దిగి కార్యాలయం లోపలికి వచ్చే సమయంలో అక్కడున్న పోలీసులు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అక్కడ మహిళా పోలీసులు ఉన్నప్పటికీ శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ చార్మిపై చేయి వేశాడు. దీనిపై అప్పుడే చార్మి కాస్త అసహనం వ్యక్తం చేసింది. 
 
అనంతరం ఐదో అంతస్తులోకి వెళ్లి విచారణకు హాజరైన చార్మి తొలుత ఈ విషయాన్నే ప్రస్తావించినట్లు సమాచారం. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ తనపై చేయివేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపడతామని సిట్ అధికారులు చార్మికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
 
మరోవైపు డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛార్మీని సిట్ అధికారులు విచారిస్తున్నారు. చార్మి, కెల్విన్‌ మధ్య వెయ్యికి పైగా వాట్సప్‌ కన్వర్జేషన్స్‌ జరిగినట్లు సమాచారం. కెల్విన్‌ ఫోన్‌లో చార్మి దాదా పేరుతో ఫోన్‌ నెంబర్‌ ఉన్నట్లు తెలిసింది.

జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్‌లో కెల్విన్‌తో కలిసి చార్మి ఫొటోలు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసిస్టెంట్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత ఛార్మిని ఇంటరాగేట్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు సిట్ అధికారులు ఛార్మీని విచారించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్... వెళ్లిపోతారా.. వెళ్లగొట్టమంటారా?

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments