Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా వి.వి.వినాయ‌క్.. ఇది నిజంగా నిజం..!

Webdunia
మంగళవారం, 14 మే 2019 (21:58 IST)
డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్... మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ‌తో ఇంటిలిజెంట్ అనే సినిమా తీసాడు. ఈ సినిమా వ‌చ్చి చాలా రోజులు అవుతున్నా... ఇప్ప‌టివ‌ర‌కు నెక్ట్స్ సినిమా ఏంటి అనేది ప్ర‌క‌టించ‌లేదు. బాల‌య్య‌తో సినిమా చేసేందుకు గ‌త కొంత కాలంగా ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్ప‌టివ‌ర‌కు సెట్ కాలేదు. 
 
ఇదిలాఉంటే... అంద‌రికీ షాక్ ఇస్తూ వినాయ‌క్ హీరోగా సినిమా చేయ‌బోతున్నాడు. వినాయ‌క్ ఏంటి హీరోగా సినిమా చేయ‌డం ఏంటి అనుకుంటున్న‌రా..? ఆయన ఏజ్‌కి, ఫిజిక్‌కి తగిన ఓ పాత్రతో మాంచి స్క్రిప్ట్ ఒకటి ఆయ‌న ద‌గ్గ‌ర‌కు రావడంతో ఆయన ఓకె చెప్పార‌ట‌. వినాయ‌క్ ద‌గ్గ‌ర‌కి ఆ స్ర్కిప్ట్‌ని పంపించింది ఎవ‌రో కాదు దిల్ రాజు.
 
డైరక్టర్ శంకర్ అసిస్టెంట్ నరసింహారావు చెప్పిన క‌థ దిల్ రాజుకు బాగా నచ్చింది. దీంతో వివి వినాయక్‌ను నెరేషన్ ఇప్పించడం, ఆయన వెంటనే ఒకే అనడం జరిగిందని స‌మాచారం. ఠాగూర్ సినిమాలో గెస్ట్ రోల్ చేసారు వినాయ‌క్. ఇప్పుడు హీరోగా చేయ‌బోతున్నారు. డైరెక్ట‌ర్‌గా మెప్పించిన ఈ డైన‌మిక్ డైరెక్ట‌ర్ హీరోగా ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటారో? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments