Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ వెంటపడుతున్న టాలీవుడ్ దర్శకుడు?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (13:03 IST)
టాలీవుడ్‌లోని సంచలన దర్శకుల్లో తేజ ఒకరు. ఈయన హీరోయిన్ కాజల్ అగర్వాల్‌పై మనసుపారేసుకున్నారు. తేజ నిర్మించి "లక్ష్మీ కళ్యాణం" చిత్రం ద్వారా కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. పైగా, మూడు పదులు దాటిన వయసులోనూ ఆమె వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అలాంటి హీరోయిన్‌పై దర్శకుడు మనసు పారేసుకున్నాడు. 
 
ఫలితంగా తాను నిర్మించే చిత్రాల్లో కాజల్‌కు ఛాన్స్ ఇస్తూ ముందుకుపోతున్నాడు. గతంలో 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంలో తొలి ఛాన్స్ ఇచ్చిన తేజ.. ఆ తర్వాత "నేనే రాజు నేనే మంత్రి", 'సీత' వంటి చిత్రాల్లో కాజల్‌కు అవకాశం కల్పించారు. ఇపుడు మరోమారు ఈ అమ్మడుపై తేజకు మనసుపడినట్టు తెలుస్తోంది. 
 
గోపీచంద్ హీరోగా డైరెక్టర్ తేజ 'అలిమేలుమంగ వేంకటరమణ' అనే సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ లేదా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారట. 
 
అయితే వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో మళ్లీ కాజల్ వైపే తేజ మొగ్గు చూపుతున్నారట. గోపీచంద్, కాజల్ ఇప్పటివరకు కలిసి నటించలేదు. దీంతో వీరి జంట తెరపై ఫ్రెష్‌గా ఉంటుందని తేజ భావిస్తున్నారట. పైగా, తాను పరిచయం చేసిన హీరోయిన్ కావడం కూడా కాజల్‌కు, తేజకు కలిసివచ్చే అవకాశంగా చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments