Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్షన్‌లో దిల్ రాజు, ఇంతకీ ఏమైంది?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (21:47 IST)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అనగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు దిల్ రాజు. దిల్ సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో భారీ చిత్రాలు నిర్మించారు. ఎన్నో విజయాలు సాధించారు. అయితే... ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. 
 
ఇంతకీ మేటర్ ఏంటంటే ఈ సినిమాలో నటించడం కోసం పవన్ కళ్యాణ్‌కి భారీగా 50 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.
 
 వకీల్ సాబ్ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాలి అనుకున్నారు. షూటింగ్ బాగానే జరుగుతుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం సమ్మర్లో వకీల్ సాబ్ రిలీజ్ అనుకుంటుంటే.. ఇంతలో కరోనా వచ్చి పడింది. అంతే.. అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. సమ్మర్ సీజన్ కాస్త పోయింది. 
 
ఏప్రిల్ 30 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా మే నెల నుంచి థియేటర్స్ ఒపెన్ చేస్తారా లేదా అనేది అనుమానమే. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసినా జనాలు వస్తారో రారో. అందుచేత వకీల్ సాబ్ ఇప్పట్లో థియేటర్లోకి రాదు. ఆగష్టులో థియేటర్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
 
 దీంతో దిల్ రాజు బాగా టెన్షన్ పడుతున్నారని టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆగష్టు వరకు సినిమాని రిలీజ్ చేయకుండా ఉంటే.. ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి తీసుకువచ్చిన అమౌంట్‌కి ఇంట్రస్ట్‌లు పెరిగిపోతాయి. దీంతో ఏం చేయాలో తెలియక దిల్ రాజు బాగా టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. అదీ మేటరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments