Webdunia - Bharat's app for daily news and videos

Install App

విల‌న్‌గా వ‌రుణ్ తేజ్... దిల్ రాజు ప్రపోజల్... ఏమైంది?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (12:25 IST)
ముకుంద‌, లోఫ‌ర్, కంచె, ఫిదా, తొలిప్రేమ‌... ఇలా వైవిధ్య‌మైన చిత్రాలు ఎంచుకుంటూ కెరీర్లో దూసుకెళుతున్న మెగా హీరో వ‌రుణ్ తేజ్. తాజాగా వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం అనే డిఫ‌రెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వ‌రుణ్ తేజ్ విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి ఎఫ్ 2 సినిమా చేస్తున్నాడు. అంత‌రిక్షం డిసెంబ‌ర్ 21న రిలీజ్ అవుతుంటే.. ఎఫ్ 2 సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే... వ‌రుణ్ తేజ్ విల‌న్‌గా న‌టించాల‌నుకుంటున్నాడ‌ట‌. 
 
అవును.. ఇది నిజంగా నిజం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ఆ మధ్య తమిళంలో సిద్ధార్థ్ హీరోగా బాబీ సింహా విలన్‌గా వచ్చిన జిగర్తాండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం వరుణ్ తేజ్ అయితే బాగుంటాడని భావిస్తున్నారట. ఆయనను సంప్రదించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. 
 
తమిళంలో విలన్ పాత్ర చేసిన బాబీసింహాకి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అది దృష్టిలో పెట్టుకుని వరుణ్ తేజ్ ఓకే అంటాడో లేక నో అంటాడో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments