Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు, అల్లు అర‌వింద్ క‌లిసి సినిమా చేస్తున్నారా?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (14:58 IST)
అభిరుచి గ‌ల నిర్మాత‌ దిల్ రాజుకు బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల‌నేది కోరిక‌. గ‌తంలో ప్లాన్ చేసారు కానీ.. వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఎప్పుడంటారా..?  భార‌తీయుడు 2 సినిమాని హిందీలో దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. విక్ట‌రీ వెంక‌టేష్ - మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో రూపొందిన ఎఫ్ 2 చిత్రాన్ని దిల్ రాజు హిందీలో నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో మ‌రో సినిమాని కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇంత‌కీ ఏ సినిమా అంటారా..? నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన జెర్సీ. తెలుగులో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌తో క‌లిసి నిర్మించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జెర్సీ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి హిందీ రీమేక్‌కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని స‌మాచారం. హీరో ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అంతా ఫైన‌ల్ అయిన త‌ర్వాత  త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలిసింది. మ‌రి.. దిల్ రాజు బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుదాం.. జగన్ పిలుపు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments