Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ పాట పాడితే ''తట్టుకోలేకపోతున్నాం'' : యువన్‌ శంకర్‌రాజా

రజినీ కాంత్ అల్లుడు నటుడు ధనుష్ నటుడిగానే పనికిరాడు అని ఎగతాళికి గురైన నటుడు. ''తుళువదో ఇళమై'' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ధనుష్‌ను ఆ చిత్రం విడుదల తరువాత ఇలాంటి వాళ్లంతా హీరోగా నిలబడతారా? అని పరిహా

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (12:47 IST)
రజినీ కాంత్ అల్లుడు నటుడు ధనుష్ నటుడిగానే పనికిరాడు అని ఎగతాళికి గురైన నటుడు. ''తుళ్ళువదో ఇళమై'' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ధనుష్‌ను ఆ చిత్రం విడుదల తర్వాత ఇలాంటి వాళ్లంతా హీరోగా నిలబడతారా? అని పరిహాసం చేసినవారు లేకపోలేదు. అయితే తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుని ఆ తర్వాత నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. 
 
ఈ హీరో నటించిన ''ఆడుగళం'' చిత్రంతో నటుడిగా జాతీయ అవార్డును, ''కాక్కాముట్టై'' చిత్రంతో నిర్మాతగా మారి జాతీయ అవార్డును అందుకున్న ధనుష్ ''వై దిస్ కొలవెరి డీ'' పాటతో గాయకుడిగా, గీత రచయితగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా గాయకుడిగా, గీతరచయితగా, నిర్మాతగా విజయపథంలో పయనిస్తున్న ధనుష్ తాజాగా సంగీత దర్శకుడిగా మరో అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది. 
 
ఈ ఫోటోలో తనలో ఉన్న సంగీత దర్శకుడి ప్రత్యేకతను చాటుకునేందుకు ఇలా ప్రయత్నించినట్లు ఉన్నారు ధనుష్‌. అయితే పక్కనే ఉన్న ధనుష్‌ అన్న సెల్వ రాఘవన్‌, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజాలు ''తట్టుకోలేకపోతున్నాం..'' అంటూ సరదాగా ఆటపట్టిస్తున్న దృశ్యమిది. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''నెంజం మరప్పదిల్లై'' సినిమా రికార్డింగ్‌ తరుణంలో తీసిన చిత్రమిది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments