బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే. నిరంతరం ఎఫైర్ వార్తలతో హీట్ పెంచే కథానాయిక. ఈ అమ్మడు ఇప్పటికే రణబీర్ కపూర్‌తో డేటింగ్ చేసి వార్తల్లోకొచ్చింది. ఆ క్రమంలోనే కిం
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే. నిరంతరం ఎఫైర్ వార్తలతో హీట్ పెంచే కథానాయిక. ఈ అమ్మడు ఇప్పటికే రణబీర్ కపూర్‌తో డేటింగ్ చేసి వార్తల్లోకొచ్చింది. ఆ క్రమంలోనే కింగ్ ఫిషర్ వారసుడు సిద్ధార్థ్ మాల్యాతో డేటింగ్ వ్యవహారం అంతే గమ్మత్తుగా ప్రచారంలోకి వచ్చింది. ఆ రెండు ఎఫైర్ల గురించి సినీ ప్రేక్షకులు మరిచిపోయాక... బాలీవుడ్ హాట్ హీరో రణవీర్ సింగ్ లైన్‌లోకి వచ్చాడు.
భన్సాలీ 'రామ్‌లీల' సినిమాతో రణవీర్‌తో కొత్త ఎఫైర్ మొదలు పెట్టింది దీపిక. ప్రస్తుతం ఈ జోడీ మధ్య జోరుగా ప్రేమాయణం సాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో ఊహకందని ట్విస్టులు దీపిక లైఫ్‌లోకి ప్రవేశించాయి. రీసెంటుగానే హాలీవుడ్ టాప్‌స్టార్.. ట్రిపుల్ ఎక్స్‌కోస్టార్.. విన్ డీసెల్‌తో లవ్వాయణం సాగిస్తున్నానని దీపిక స్వయంగా ప్రకటించి షాకిచ్చింది. దీంతో రణవీర్ ఇక సైడైపోయినట్టేనని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కూడా ఆ జోడీ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ.. పార్టీలు, పబ్బులకు షికార్లు చేయడంపై వాడి వేడి చర్చ సాగింది.
ఇక ఇంతలోనే తాజాగా జరిగిన హేమమాలిని పుట్టినరోజు వేడుకల్లో దీపిక పదుకొనె మాట్లాడిన ఓ మాట అందరికీ షాకిచ్చింది. అందరు ఆడపిల్లల తండ్రుల్లానే తనకు తండ్రి ప్రకాశ్ పదుకొనె సంబంధాలు చూస్తున్నారంటూ ప్రకటించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. సూటిగా అలా చెప్పకపోయినా.. నాన్నగారు కూడా సంబంధాలు చూస్తున్నారేమో..! అంటూ నవ్వేసింది. ఆ క్షణం అక్కడ రణవీర్ ఉండి ఉంటే మొహం మాడిపోయే మ్యాటరే అది. మరి ఇంతకీ ఎదిగొచ్చిన పిల్లకి నాన్నోరు సంబంధం వెతుకుతున్నారా? లేదా? ఒకవేళ రణవీర్‌తో డేటింగ్‌కి అంగీకరించారా? ఏమో.. దీనికి కూడా దీపికనే సమాధానం చెప్పాలి.