Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరోయిన్‌కు కలిసొచ్చిన పెళ్లి.. సంపాదనలో అదుర్స్...

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (07:20 IST)
బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఈమెకు వివాహం బాగా కలిసివచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే.. సంపాదనలో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకెళుతోంది. సినిమాలతో పాటు.. అంతర్జాతీయ వ్యాపార ఉత్పత్తులకు ప్రచారకర్తగా పనిచేస్తూ ఒక్క యేడాదికే రూ.500 కోట్ల మేరకు సంపాదిస్తోందట. 
 
నిజానికి పెళ్లి చేసుకున్న తర్వాత కథానాయికలకు ఫాలోయింగ్‌ తగ్గిపోతుందని.. మునుపటిలా సినీ అవకాశాలు కూడా రావని పరిశ్రమలో ఓ అపోహ ఉంది. కానీ, ఈ మంగళూరు సొగసరి దీపికాపడుకొనె సంపాదన చూస్తే అవన్నీ అవాస్తవాలే అనిపిస్తాయి. పెళ్లయిన తర్వాతే ఆమె కెరీర్‌ మరింతగా ఊపందుకుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
సినిమాలతో పాటు పలు అంతర్జాతీయ వ్యాపార ఉత్పత్తులకు ప్రచారకర్తగా దీపికాపడుకొనె సంవత్సరానికి రూ.500 కోట్లు ఆర్జిస్తోందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఒక్కో సినిమాకు ఈ అమ్మడు రూ.15 కోట్ల పారితోషికాన్ని అందుకుంటోందట. ఇటు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ వేదికపై కూడా దీపికా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ కారణంగా కత్రినా కైఫ్, కరీనా కపూర్ వంటి వారికంటే ఎక్కువగా డిమాండ్‌ ఏర్పడిందని ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు. 
 
కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు హీరో ప్రభాస్‌తో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలో నటించేందుకు సమ్మతించింది. ఈ చిత్రంలో భారీ స్థాయిలో పారితోషికం అందుకోనుందనే వార్తలు గుప్పుమన్నాయి. అంటే.. హీరో కంటే అధికంగానే అందుకోనుందట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments