Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న వారసులు: ఇక రానా సోదరుడు అభిరామ్ తెరంగేట్రమే తరువాయి..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వార‌సుల హ‌వా కొన‌సాగుతోంది. ఇప్పటికే నంద‌మూరి వారసులు, అక్కినేని వారసులు, మెగా ఫ్యామిలీల నుంచి ఇప్ప‌టికే చాలామంది న‌టీనటులు టాలీవుడ్‌‌ను షేక్ చేస్తున్నారు. అలానే దాదా సాహెబ్ పాల

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (12:18 IST)
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వార‌సుల హ‌వా కొన‌సాగుతోంది. ఇప్పటికే నంద‌మూరి వారసులు, అక్కినేని వారసులు, మెగా ఫ్యామిలీల నుంచి ఇప్ప‌టికే చాలామంది న‌టీనటులు టాలీవుడ్‌‌ను షేక్ చేస్తున్నారు. అలానే దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు వారసులు కూడా టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్, రానా హీరోలుగా తమకంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 
 
రానా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే తనదైన శైలిలో చిత్రాలను చేసుకుంటూ తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. కాగా దగ్గుబాటి కాంపౌండ్ నుంచి మ‌రో న‌టుడు సినీ రంగప్ర‌వేశం చేయ‌నున్నాడు. అతడెవరో కాదు రానా త‌మ్ముడు అభిరామ్. అభిరామ్ ఇప్పటికే యాక్టింగ్‌కు సంబంధించి నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడట.
 
ఈ నేపథ్యంలోనే, కొంతకాలంగా తన తొలి చిత్రం కోసం అతడు కథలు వింటున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే, సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అభిరామ్ హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. అన్నయ్య బాటలోనే అభిరామ్ కూడా సక్సెస్ అందుకుంటాడే లేదో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments