Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి రీమేక్ కోసం చిరంజీవి రూ.30 కోట్ల పారితోషికం తీసుకున్నారా? నిజమేనా?

Webdunia
మంగళవారం, 3 మే 2016 (10:31 IST)
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తమిళంలో విజయం సాధించిన 'కత్తి' చిత్రం రీమేక్‌ని తెలుగులో ''కత్తిలాంటోడు'' టైటిల్‌తో చిరు నటించబోతున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించబోతున్నాడు. 
 
రామ్ చరణ్‌ సొంత బ్యానర్‌తో పాటు, లైకా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో చిరు చేయబోతున్న సినిమాకి భారీ పారితోషికం తీసుకోబోతున్నాడు. ''కత్తి'' సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్న చిరంజీవి 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అందుకు నిర్మాతలు కూడా సై అంటున్నారట. అడ్వాన్స్‌గా 15 కోట్లు ఆయనకి అందనున్నట్టు సినీనిపుణులు అంటున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్‌కు ఉన్న ఫాలోయింగ్, ఆయన 150 సినిమా మీద ఉన్న అంచనాలు, చాలాకాలం తరువాత చిరంజీవి నటిస్తోన్న సినిమా కావడంతో, భారీ వసూళ్లు ఉంటాయనే బలమైన నమ్మకంతో నిర్మాతలు వున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments