Webdunia - Bharat's app for daily news and videos

Install App

కజిన్ మెహర్ రమేష్ చిత్రానికి ఓకే చెప్పిన 'ఆచార్య'

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (15:42 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 70 శాతం మేరకు పూర్తయింది. కరోనా కారణంగా మిగిలిన పార్ట్‌ను పూర్తి చేయలేక పోయారు. అయితే, చిరంజీవి మాత్రం ఆచార్య సెట్స్‌పై ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులకు చకచకా క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వాటిలో తన కజిన్ అయిన డైరెక్టర్ మెహర్ రమేష్ చిత్రం చేసేందుకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి ఈ చిత్రం కంటే ముందు మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" చిత్రంలో నటించాల్సివుంది. ఈ చిత్రానికి 'సాహో' దర్శకుడు సుజిత్‌ను తొలుత దర్శకుడిగా ఎంపిక చేశారు. కానీ, ఆయన పనితీరు చిరంజీవికి నచ్చలేదు. దీంతో 'లూసిఫర్' రీమేక్ బాధ్యతలను స్టార్ డైరెక్టర్ వివివినాయక్‌కు అప్పగించారు. ప్రస్తుతం వినాయక్ 'లూసిఫర్' స్క్రిప్టుపై పనిచేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు.
 
మరోవైపు, తమిళ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ "వేదాళం". ఈ చిత్రాన్ని కూడా తెలుగులోకి చిరంజీవి రీమేక్ చేయనున్నారు. దీని బాధ్యతలను తన కజిన్ మెహర్ రమేశ్‌కి దర్శకుడిగా చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఇటీవలే ఈ స్క్రిప్టును చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా రూపొందించి చిరంజీవికి మెహర్ వినిపించాడట. దీనికి చిరంజీవి ఎటువంటి మార్పులు చెప్పకుండా, సంతృప్తిని వ్యక్తం చేసి, వెంటనే ఓకే చెప్పేశారని అంటున్నారు. సో... చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కుర్ర హీరోలతో పోటీపడుతూ కొత్తకొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments