Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రోజున విడుదల కానున్న చిరంజీవి - బాలకృష్ణ చిత్రాలు

చిరంజీవి 150వ చిత్రమైన 'ఖైదీ నంబర్‌ 150'. బాలకృష్ణ వందోచిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ రెండు చిత్రాలకు ఇంకా డేట్ ఫిక్స్‌ కాలేదు. అయితే ఈ రెండు సినిమాల నడుమ కనీసం ఒకటి

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (11:46 IST)
చిరంజీవి 150వ చిత్రమైన 'ఖైదీ నంబర్‌ 150'. బాలకృష్ణ వందోచిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ రెండు చిత్రాలకు ఇంకా డేట్ ఫిక్స్‌ కాలేదు. అయితే ఈ రెండు సినిమాల నడుమ కనీసం ఒకటి రెండు రోజుల గ్యాప్‌ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అలా అయితేనే రెండు సినిమాలకీ మంచిదని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. కానీ ఆ రెండు రోజుల గ్యాప్‌ మాత్రం దేనికని, చిరంజీవి సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయితే అదే రోజున తమ చిత్రం కూడా రిలీజ్‌ చేసేయాలని బాలయ్య పట్టుబడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
గతంలో అలాగే ఒకే రోజున మృగరాజు, నరసింహనాయుడు రిలీజ్‌ అయితే బాలయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే మారిన మార్కెట్‌ లెక్కల ప్రకారం... రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదలైతే థియేటర్లు కేటాయించడం కూడా కష్టమవుతుందని బయ్యర్లు అంటున్నారు. ప్రస్తుతం ఖైదీ నంబర్‌ 150ని జనవరి 11న, శాతకర్ణిని జనవరి 13న విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్నా కానీ బాలయ్య మాత్రం అదే రోజున రిలీజ్ చేయాలని మొండికేస్తున్నాడట. బాలయ్య కనుక ఎవరి మాటా విననట్టయితే రెండూ ఒకే రోజున విడుదలయినా ఆశ్చర్యం లేదని సినీపండితులు అంటున్నారు.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments