'బాహుబలి' రికార్డుల్ని బీట్ చేసేందుకు 'మెగా' పట్టు... MEKని కూడా పక్కనెట్టేస్తున్నారట...
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియనిదేముంది. క్రింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ఇండస్ట్రీలో కాలుపెట్టి తనదైన స్టయిల్‌ను క్
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియనిదేముంది. క్రింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ఇండస్ట్రీలో కాలుపెట్టి తనదైన స్టయిల్‌ను క్రియేట్ చేసుకున్నారు. తదుపరి మెగాస్టార్ అయ్యారు. డ్యాన్స్, ఫైట్స్ ఇలా ఏది తీసుకున్నా ఆయనే బెస్ట్ అని టాలీవుడ్ ఇండస్ట్రీ చెప్పే మాట.
ఐతే అలాంటి నటుడు రాజకీయ రంగప్రవేశం కారణంగా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖైదీ నెం. 150తో ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ భారీ విజయాన్ని సొంత చేసుకున్నాడు. ఐతే తాజాగా విడుదలయిన బాహుబలి చిత్రం రికార్డులు టాలీవుడ్ సినీ హీరోలనే కాదు, బాలీవుడ్ సహా ఇతర అన్ని ఇండస్ట్రీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
బాహుబలి రికార్డులను క్రాస్ చేయాలంటే సామాన్యమైన పనికాదని అందరూ బహిరంగంగానే చెపుతున్నారు. ఐతే చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం ద్వారా రికార్డు సృష్టించే అవకాశం వున్నదని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అందుకే చిరంజీవి MEK... మీరో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి కూడా విరామం తీసుకుంటున్నారని సమాచారం. పైగా ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ వున్నది కావడంతో కాస్తంత క్రేజ్ మామూలే. చూడలి... ఏం జరుగుతుందో...!