Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ సినిమా.. మెగాస్టార్ అండర్ వేర్ సీన్‌లో నటిస్తాడా? లేదా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మెగా మూవీకి స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై రామ్ చరణ్ సినిమాను నిర్మి

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (12:31 IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మెగా మూవీకి స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై రామ్ చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కాజల్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
ఈ సినిమాలో మెగాస్టార్ అండర్ వేర్ సీన్‌లో నటిస్తాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. తమిళంలో సూపర్ హిట్టయిన కత్తిలో కోలీవుడ్ హీరో విజయ్ అండర్ వేర్ ధరించిన సీన్ ఉంది. అయితే, ఈ సీన్‌లో చిరు కనిపిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కత్తికి రీమేక్ అయినప్పటికీ తమిళంలో ఉన్నట్లు మక్కికి మక్కి, సీన్ టు సీన్ కాకుండా... మెగాస్టార్ ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగిన విధంగా వివి.వినాయక్ మార్పులు చేస్తున్నారని తెలిసిన విషయమే. 
 
కమర్షియల్ ఎంటర్టైనర్, చిరంజీవి సినిమాలకి పెట్టింది పేరు...అటువంటి చిరు ఇలాంటి సీన్స్‌లో నటిస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని యూనిట్ చర్చించినట్టు సమాచారం. ఈ సీన్‌కి వివి వినాయక్ కూడా అంతగా మొగ్గు చూపడంలేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వేచి యుండాల్సిందే.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments