Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి ముగ్గురు భార్యలు..? అలా ఒప్పుకుంటారా?

ఖైదీ 150 సినిమా బంపర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఆధారంగా తీసుకుని రూపుదిద్దుకుంటున్న సినిమాలో.. ముగ్గ

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (14:40 IST)
ఖైదీ 150 సినిమా బంపర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఆధారంగా తీసుకుని రూపుదిద్దుకుంటున్న సినిమాలో.. ముగ్గురు భామలతో చిరు రొమాన్స్ చేయనున్నాడు. సినిమాలోని కథ ప్రకారం హీరోకు ముగ్గురు భార్యలుంటారని.. అందుకే టాప్ హీరోయిన్లను చిరంజీవి సరసన నటింపజేసేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 
 
అయితే సినిమా కోసం ముగ్గురికి భర్తగా చిరంజీవిని చూపించాలా.. లేకుంటే ఏకపత్నీ వ్రతుడిగా చూపించాలా అనే అంశంపై దర్శకుడు స్క్రిప్ట్ వర్క్‌ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఒకవేళ ముగ్గురు భార్యలకు భర్తగా చిరంజీవిని చూపెడితే మాత్రం మళ్లీ హీరోయిన్ వేట ఆరంభించాల్సిందేనని సినీ యూనిట్ అంటోంది. ఎందుకంటే..? 150వ సినిమాకే హీరోయిన్ల కోసం వెతికి వెతికి చివరికి కాజల్ అగర్వాల్‌ను ఓకే చేశారు. మరి ఈసారి ముగ్గురు హీరోయిన్లంటే.. ఎవరికి ఛాన్సులు వస్తాయో.. ఎవరు ఒప్పుకుంటారో అనే అనుమానం ఏర్పడింది. 
 
అందుకే కథలో స్వల్ప మార్పులు చేసి ఇద్దరు లేదా ఒకే హీరోయిన్‌తో సరిపెడతారని తెలుస్తోంది. ముగ్గురు కథానాయికలంటే బడ్జెట్ కూడా పెరిగే ప్రమాదముంది. మరీ సినిమా సీరియస్‌గా ఉండకుండా రొమాన్స్ కూడా బాగా పండించేందుకు ముగ్గురు నాయికలను కూడా తీసుకునే అవకాశమూ లేకపోలేదని సినీ పండితులు అంటున్నారు. ఇందులో భాగంగా అనుష్క, త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్. మరి ముగ్గురు భార్యలతో చిరంజీవి రొమాన్స్ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments