Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మెగా' ఇంట పెళ్లి సందడి... పసుపుకుంకుమ వేడుకతో ప్రారంభం!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (19:37 IST)
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం త్వరలో జరగనుంది. ఈ పెళ్లిసందడి పనులు పసుపు కుంకుమ వేడుకతో గురువారమే ప్రారంభమైనట్టు సినీ వర్గాల సమాచారం. అయితే, మెగా ఫ్యామిలీ నుంచి ఈ వివాహానికి సంబంధించిన ఒక ప్రకటన అధికారికంగా వెలువడాల్సి వుంది.
 
ప్రస్తుతం యూఎస్‌లో నివసిస్తున్న శ్రీజ.. అక్కడే పారిశ్రామికవేత్తగా స్థిరపడిన చిత్తూరుకు చెందిన ఎన్ఆర్ఐతో ఆమె వివాహం జరుగనుంది. ఈ వరుడి కుటుంబం చిరంజీవి కుటుంబానికి సన్నిహితమైనదని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పవన్ కల్యాణ్ సహా 'మెగా' కుటుంబం వరుడి కుటుంబసభ్యులను కలిసారని, మార్చి చివరి వారంలో ఈ వివాహం జరుగుతుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, హైదరాబాద్‌కు చెందిన శిరీష్ భరద్వాజ్ను శ్రీజ గతంలో ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శిరీష్‌తో విడాకులు తీసుకున్న విషయంతెలిసిందే. కాగా, శ్రీజ - శిరీష్ భరద్వాజ్‌లకు ఓ సంతానం కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments