Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక పెళ్ళి ఫిక్స్ వెనుక మెగాస్టార్ చిరంజీవి కీ రోల్!

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (14:28 IST)
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక. టాలీవుడ్ హీరోయిన్. ఈ అమ్మడు త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతోంది. తనకు కాబోయే వరుడిని కూడా ఎంపిక చేసుకుంది. అతనితో కలిసి దిగిన ఫోటోలను ఆమె తాగా బహిర్గతం చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిహారిక పెళ్లాడనున్న వరుడు పేరు చైతన్య జొన్నలగడ్డ. హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పైపెచ్చు.. ఓ ఐపీఎస్ అధికారి కుమారుడు. అతని గుణగణాలు నచ్చడంతో నిహారికి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 
 
అయితే, చైతన్య - నిహారికల పెళ్లి ఫిక్స్ కావడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి అని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎందుకంటే.. చైతన్య తండ్రి ఓ ఐపీఎస్ అధికారి. పేరు ప్రభాకర్ రావు. ఈయన - చిరంజీవి మంచి స్నేహితులు. వీరిద్దరూ అపుడపుడూ సమావేశమవుతూ, వివిధ అంశాలపై చర్చించుకుంటుంటారు. 
 
ఈ క్రమంలో ఓ రోజున ప్రభాకర్ తన కుమారుడు చైతన్యకు వధువు కోసం గాలిస్తున్నట్టు చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చిరంజీవి తన తమ్ముడు నాగబాబుతో సంప్రదించి, నిహారిక ప్రస్తావనను ప్రభాకర్ రావు వద్ద తెచ్చారు. ఆయన తన కుమారుడు చైతన్యతో మాట్లాడారు. ఆ తర్వాత నిహారిక, చైతన్యల మధ్య స్నేహం కుదిరింది. 
 
వీరిద్దరూ కొంతకాలం మాట్లాడుకున్న తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని తన తండ్రి నాగబాబుకు నిహారిక చెప్పడంతో ఆయన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోలను నిహారికతో పాటు, వరుడు చైతన్య కూడా తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అలా, నిహారికకు పెళ్లి ఫిక్స్ కావడంలో చిరంజీవి కీలక పాత్రను పోషించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments