Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అయితే.. అది ఎప్పుడు?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (22:27 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఆగష్టు 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... కరోనా కారణంగా జరగలేదు. అయితే.. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. నాగార్జున వైల్డ్ డాగ్, చైతన్య లవ్ స్టోరీ, సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు చిత్రాలు షూటింగ్ స్టార్ట్ చేసాయి. దీంతో మిగిలిన హీరోలు కూడా తమ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
 
అయితే... మెగా ఫ్యాన్స్ ఆచార్య షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. బాస్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి ఆచార్య టీమ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధం కండి అంటూ సందేశం పంపించారు అని తెలిసింది. దీంతో కొరటాల టీమ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారట.
 
ఎప్పుడు స్టార్ట్ చేసినా... మధ్యలో గ్యాప్ లేకుండా కంటిన్యూ షెడ్యూల్‌తో ఫినిష్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. అక్టోబర్ నుంచి ఆచార్య సెట్స్ పైకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments