Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో చిక్కుకున్న సల్మాన్ ఖాన్ 'సుల్తాన్'

తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ''సుల్తాన్' వివాదంలో చిక్కుకుంది. హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత యశ్రాజ్ ఫిలిమ్స్‌పై బిహార్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. అసలు వ

Webdunia
సోమవారం, 11 జులై 2016 (09:34 IST)
తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ''సుల్తాన్' వివాదంలో చిక్కుకుంది. హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత యశ్రాజ్ ఫిలిమ్స్‌పై బిహార్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. అసలు విషయం ఏంటంటే... ముజాఫర్పూర్‌కు చెందిన సబీర్ అన్సారీ అనే వ్యక్తి సీజేఎం కోర్టులో సుల్తాన్ యూనిట్‌పై కేసు పెట్టాడు. ''సుల్తాన్'' సినిమా తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారని ఆరోపించాడు. తన కథతో సినిమా తీసేందుకు సల్మాన్ తనను పలుమార్లు సంప్రదించాడని అన్సారీ తెలిపాడు. 
 
దీని కోసం మొదట తనకు సల్మాన్ రూ.20 కోట్లు ఇస్తానని అన్నారని.. అయితే సినిమా రిలీజైన తర్వాత కూడా డబ్బు చెల్లించలేదని అన్సారీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని సీజేఎం కోర్టును ఆశ్రయించాడు. సినిమా విడుదలకు ముందే డబ్బులిచ్చేట్లు ఒప్పందం కుదిరిందని.. కనీసం విడుదల తర్వాత అయినా తనకు న్యాయం జరుగుతుందనుకుంటే ఎవ్వరూ స్పందించట్లేదని అన్నాడు. 
 
ఈ కథ విషయంలో పాత్ర విషయంలో సలహాల కోసం తనను సల్మాన్ చాలాసార్లు కలిశాడని వెల్లడించాడు. మరి ఈ ఆరోపణలపై సల్మాన్ అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు జూలై 12కు వాయిదా వేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments