Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద జన్మలెత్తినా.. నా భర్తగా నిన్నే కోరుకుంటా.. మంచి తండ్రివి అవుతావు: సమంత (వీడియో)

గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నాగచైతన్య-సమంత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. హిందూ సంప్రదాయం ప్రకారం చైతూ-సమంతల వివాహం ఈ నెల ఆరో తేదీన జరిగిన సంగతి తెలిసిందే. తాళి కట్టు వేళ సమంత ప్రేమించిన వ్యక్తి

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (12:27 IST)
గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నాగచైతన్య-సమంత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. హిందూ సంప్రదాయం ప్రకారం చైతూ-సమంతల వివాహం ఈ నెల ఆరో తేదీన జరిగిన సంగతి తెలిసిందే. తాళి కట్టు వేళ సమంత ప్రేమించిన వ్యక్తినే భర్తగా పొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆనందభాష్పాలు రాల్చింది. ఇదేవిధంగా క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహంలోనూ సమంత భావోద్వేగానికి లోనైంది. 
 
సమంత, చైతన్య వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, క్రైస్తవ పద్ధతిలో వీరి వివాహం జరిగిన సందర్భంలో నాగచైతన్య గురించి సమంత చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
 
ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ, ''నీ రాకతోనే నా జీవితానికి పరిపూర్ణత లభించిందని.. నా జీవితంలో నేను చూసిన అద్భుతమైన చిరునవ్వు నీదే. నాకు మరో వంద అవకాశాలు వచ్చినా, మరో వంద జన్మలెత్తినా నా భర్తగా నిన్నే కోరుకుంటా. మన పిల్లలకు మంచి తండ్రివి అవుతావు'' అని ఆ రోజున సమంత భావోద్వేగంతో మాట్లాడింది. ఆపై చైతూకు రింగు తొడిగింది.
 
మరోవైపు సమంత తాను చాలా అభిమానించే వ్యక్తి ఆమె ఈమేనంటూ ఓ ఫోటోను పోస్టు చేసింది. ఆమె ఎవరో కాదు.. నాగచైతన్య, ఆయన తల్లి లక్ష్మి. నాగచైతన్య-సమంతల వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో పలు ఫొటోలు కనబడుతున్నాయి. అయితే, తనకు ఎంతో ఇష్టమైన ఫోటో ఇదని, తాను చాలా అభిమానించే వ్యక్తి లక్ష్మి అంటూ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సమంత పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments