Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ సమంత ఆశురెడ్డికి ఆ అవకాశం వస్తుందా?

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (23:06 IST)
ఆశురెడ్డి అంటే చాలామందికి తెలియదు. కానీ జూనియర్ సమంత అంటే మాత్రం ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా. సోషియల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఆశురెడ్డి అంటే తెలియదనడంలో అతి శయోక్తి లేదు. సమంత ఫేస్ కట్ తో క్యూట్ గా కనిపించే ఆశురెడ్డి ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
 
బిగ్ బాస్ 3లో ఆశురెడ్డి సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఆశురెడ్డి అస్సలు ఫేమస్ అవ్వడానికి ఆమె చేసిన డబ్ స్మాష్ వీడియోలే ముఖ్య కారణం. ఆమె చేసిన వీడియోలు కాస్త బాగా పాపులర్ అవ్వడంతో ఆమెకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. సినిమాల్లో నటించకపోయినా కేవలం డబ్ స్మాష్ వీడియోలతో తానేంటో నిరూపించుకుంది.
 
ఏమాయే చేశావే సినిమాలో సమంత నటించిన ఒక సన్నివేశాన్ని తీసుకుని ఆవురెడ్డి అలాగే చేసి ఆ వీడియోను ఇన్ స్ట్రాగ్రాంలో పోస్ట్ చేసింది. ఇంకేముంది లక్షలమంది ఫ్యాన్స్ ఆమెను జూనియర్ సమంత అనడం మొదలెట్టేశారు. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్ట్రాగ్రాంలో 4.8లక్షలమంది ఫాలోయర్స్ ఉన్నారు.
 
అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకు ముందు అంటే సరిగ్గా రెండు నెలల క్రితం ఆశురెడ్డికి సినిమాల్లో అవకాశం వచ్చిందట. ఒక సినిమాలో తనకు సైడ్ క్యారెక్టర్ వచ్చినట్లు ఆమే స్వయంగా ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులందరూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే కరోనా కారణంగా ఆ సినిమా కాస్త ఆగిపోయింది. మళ్ళీ సినిమాను చేస్తారో లేదో తెలియని పరిస్థితి. దీంతో ఆషురెడ్డి సినిమాల అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. కనీసం బుల్లితెర మీదైనా కనిపించాలని తెగ ట్రై చేస్తోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments