Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను తీసుకుందామన్న బన్నీ.. త్రిషనే బెస్ట్ అంటోన్న ప్రేమ్..?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (16:46 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తదుపరి సినిమాపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. అల్లు అర్జున్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వుంటుందని టాక్. అయినా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు కాస్త టైమ్ పట్టేలా వుంది. ఇంతలోపు గ్యాప్‌లో ఏదైనా సినిమా చేసేయాలని బన్నీ ఉవ్విళ్లూరుతున్నాడట. 
 
ఇందులో భాగంగా తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించి హిట్ అయిన ''96'' రీమేక్‌లో నటించేందుకు అల్లు అర్జున్ ఆసక్తి చూపుతున్నాడట. 96 అల్లు అర్జున్‌కు చాలా బాగా నచ్చేయడంతో ఆ సినిమాను తెలుగులో చేయాలనుకుంటున్నాడట. 
 
అంతేగాకుండా తన కెరీర్‌లో వైవిధ్యమైన సినిమా అది వుంటుందని బన్నీ భావిస్తున్నాడట. ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలెట్టేశాడట. ప్రముఖ దర్శకుడు దిల్ రాజుతో ఈ సినిమా రీమేక్ కోసం మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఇప్పటికే దిల్ రాజు తీసుకోగా, తమిళ మూవీకి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించనున్నారు. 
 
అల్లు అర్జున్- దిల్ రాజు కాంబోలో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత అయితేనే బాగుంటుందని భావిస్తున్నారు. కానీ దర్శకుడు త్రిషనే కథకు సరిపోతుందని చెప్పినట్లు టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments