బన్నీ-ఎన్టీఆర్ తప్పించుకున్నారు.. నాని బుక్కైయ్యాడు...

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (22:04 IST)
నేచుర‌ల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడ‌ర్. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. అయితే... రిలీజ్ అయిన మొదటి షో నుండి సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ ఆఫ్ ఇంకొంచం డెప్త్ ఉండాలని ప్రతిఒక్కరు చెబుతున్నారు. చాలా రివ్యూస్ కూడా ఇదే విషయాన్నీ చెప్పాయి. 
 
టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరు ఊహించ‌లేదు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.... ఈ చిత్రాన్ని బన్నీ చేయాలి. చాలా కాలం క‌థా చ‌ర్చ‌ల అనంత‌రం బ‌న్నీ నో చెప్ప‌డంతో విక్ర‌మ్ ఈ క‌థ‌ను ఎన్టీఆర్‌కి చెప్ప‌డం జ‌రిగింద‌ట‌. ఎన్టీఆర్ కూడా ఇది స్టార్ హీరో చేసే మెటీరియల్ ఉన్న సబ్జెక్టు కాదని, సెకండ్ ఆఫ్‌లో ఇంకా కొంచం డెప్త్ ఉండాలని చెప్పటంతో అక్కడ నుండి విక్రమ్ బయటకు వచ్చాడు. 
 
ఇక మైత్రితో విక్రమ్‌కి అగ్రిమెంట్ ఉండటం, ఎప్పటి నుండో మైత్రి వాళ్ళు నానితో సినిమా చేయాలనీ అనుకోవటంతో ఈ సినిమాని నానితో చేశారు. 
 
కానీ ఫలితం మాత్రం బన్నీ, ఎన్టీఆర్ ఊహించినట్లే వచ్చింది. నిజంగానే సెకండ్ ఆఫ్ వీక్ అయ్యింది. అలాగే స్టార్ మెటీరియల్ ఇందులో లేదు. నెక్స్ట్ డోర్ అబ్బాయి లాంటి నాని కాబట్టి కొంచం ఈ సినిమా చూడగలుగుతున్నారు. ఇక ఈ సినిమా విషయంలో బన్నీ, ఎన్టీఆర్ తప్పించుకుంటే నాని మాత్రం బుక్ అయ్యాడు. అదీ.. సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments