Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య 101 సినిమాలో రైతుగా.. మరి చిరంజీవి 151వ సినిమా ఎలాంటి పాత్రలో నటిస్తారో?

బాలయ్య వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" చేస్తుండగానే 101 సినిమా కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి కూడా 151వ సినిమాపై ఇప్పటికే చర్చలు మొదలెట్టారు. ప్రస్తుతం దర్శకుడు వివి వ

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (14:50 IST)
బాలయ్య వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" చేస్తుండగానే 101 సినిమా కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి కూడా 151వ సినిమాపై ఇప్పటికే చర్చలు మొదలెట్టారు. ప్రస్తుతం దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ 150వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చాలామంది ఈ సినిమానే చిరంజీవి చివరి సినిమా అని అనుకుంటున్నారు. 
 
కానీ తాజా సమాచారం ప్రకారం 150వ సినిమా షూటింగులో బిజీగా ఉంటూనే చిరంజీవి తన 151, 152వ సినిమా ప్రాజెక్టులను కూడా ఓకే చేసే పనిలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. వీలైనన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించేందుకు చిరు సిద్ధమవుతున్నారు. అయితే 150వ సినిమా ఎప్పటినుంచో అనుకున్నప్పటికి చివరికి ఇప్పుడు కుదిరింది. 
 
ఈ సినిమా పూర్తికాకముందే చిరంజీవి 151వ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దీంతో ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. అయితే ఆ అవకాశం బోయపాటి శ్రీనుకి దక్కింది. 'సరైనోడు' హిట్‌తో మాంచి ఊపుమీదున్న బోయపాటికి మెగాస్టార్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చిరు ఓ సంద‌ర్భంలో బోయ‌పాటితో ఓ సినిమా చేయాల‌ని అందరి ముందు ప్ర‌క‌టించిన విషయం తెల్సిందే. 
 
ఇక ఆ ఛాన్స్ ఇప్పుడు బోయ‌పాటికి కలిసొచ్చింది. దీనిలో భాగంగా మెగాస్టార్‌కు త‌గ్గ స్టోరీని రెఢీ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి.... చిరంజీవిని తనదైన స్టల్‌లో చూపించి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments