Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి సినిమా ఆగిపోయిందా...?!

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (18:15 IST)
'లెజెండ్‌' తర్వాత గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు బోయపాటి శీను.. మహేష్ బాబుకూ కథ చెప్పాడు. కానీ నచ్చకపోవడంతో విరమించుకున్నాడు. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్‌ తన కుమారుడు శ్రీనును హీరోగా చేస్తూ ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే... ఆ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. 
 
చిత్ర కథలో హీరో క్యారెక్టర్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం కోసం జుట్టు పెంచడం, బాడీ బిల్డప్‌ చేయడం వంటివి వున్నాయి గనుక కొన్ని నెలలు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. అయితే.. ఇప్పటికే బెల్లంకొండ సురేష్‌పై అప్పుల వాళ్ళు మీదపడుతున్నారు. కొన్నాళ్ళు అజ్ఞాతంలో వున్న ఆయన మరలా వచ్చాడు. 
 
అయితే ఈసారి నిర్మాతగా.. తన పేరు కాకుండా తన బంధువు అయిన నల్లమలుపు బుజ్జి పేరును తెరపైకి తెచ్చాడు. 'అల్లుడు శీను' చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీను చేయబోయే సినిమాకు నిర్మాత ఆయనే. కానీ వెనుక  వుండి కథంతా నడిపించేది సురేషే. ఈ గ్యాప్‌తో బోయపాటి సినిమా ఆగిపోయిందేమోనని అనుకుంటున్నారు. కానీ తన కొడుకు సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగనీయకుండా చూడాలని సురేష్‌ ప్రయత్నిస్తున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments