Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి''గా సావిత్రి జీవిత కథ: హీరోయిన్‌గా ఎవరు నటిస్తారో?

Webdunia
శనివారం, 28 మే 2016 (13:42 IST)
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. మహానటి సావిత్రి అంటే తెలుగులో తెలియని వారుండరు. సావిత్రి తన అందంతో, నటనతో ప్రేక్షకుల మనసును దోచుకు౦ది. ఇప్పుడు సావిత్రి జీవిత కథని సినిమాగా తీయాలని ''ఎవడే సుబ్రహ్మణ్యం'' చిత్రాన్ని తీసిన నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. 
 
1950లో వచ్చిన ''సమరసం'' అనే తెలుగు, తమిళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ''గుండమ్మ కథ'', ''మిస్సమ్మ'', ''భలే రాముడు'', ''మాయబజార్'' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిని దోచుకుంది. అక్కినేని, ఎన్టీఆర్‌తో కలిసి ఆమె నటించిన సినిమాలు... ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో మాటల్లో వర్ణించలేము.
 
తమిళ నటుడు 'కాదల్ మన్నన్' జెమిని గణేషన్‌ని పెళ్లి చేసుకుని పేరు ప్రతిష్టలు, సిరిసంపదలు సొంతం చేసుకున్న సావిత్రి జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు సావిత్రి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను కూడా ఈ చిత్రం ద్వారా కన్నులకు కట్టినట్టుగా చూపించనున్నాడట. ఈ చిత్రానికి ''మహానటి''అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 
 
ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో అశ్విన్ నిమగ్నమైయున్నాడు. అయితే, మహానటి సావిత్రి పాత్రను ఏ హీరోయిన్ పోషిస్తుందన్నదనే విషయం మాత్రం టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతుంది. టాప్ హీరోయిన్‌ని మహానటిగా చూపించాలని అశ్విన్ ఆరాటపడుతున్నాడు. మరి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments