Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాస్పదంగా మారిన రోజా 'రచ్చబండ' షో

ఒకప్పటి హీరోయిన్‌గా, ఆ తర్వాత రాజకీయనాయకురాలిగా సినీనటి రోజా అందరికి సుపరిచితమే. వీటన్నిటి కంటే టీవీ షో ల్లో చాలా పాపులర్ అయింది. ''జబర్దస్త్'' షో ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసింది. జబర్దస్త్ అంటే తెల

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (09:35 IST)
ఒకప్పటి హీరోయిన్‌గా, ఆ తర్వాత రాజకీయనాయకురాలిగా సినీనటి రోజా అందరికి సుపరిచితమే. వీటన్నిటి కంటే టీవీ షో ల్లో చాలా పాపులర్ అయింది. ''జబర్దస్త్'' షో ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసింది. జబర్దస్త్ అంటే తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి లేదేమో. ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రోజా, నాగబాబు‌కు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కానీ ఉన్నట్టుండి ఏమైందో కాని రోజా జబర్దస్త్‌లో ఈ మధ్య మాయమైంది. ఆమె స్థానంలో మంచు లక్ష్మి ప్రత్యక్షమైంది. ఈ షో అనంతరం రోజా 'రచ్చబండ' అనే ప్రోగ్రామ్‌ని చేస్తోంది. 
 
ఇప్పటికే ఆ షోలో హోస్ట్‌గా చేసిన సుమలత, జీవిత రాజశేఖర్ మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే రోజా కూడా ఈ షోపై మొగ్గుచూపించింది. కానీ ఈ మధ్య ఆ షోలో రోజా ఓవరాక్షన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. నాలుగు గోడల మధ్య జరగాల్సిన గొడవను, షో పేరుతో నాలుగు కోట్ల మంది చూసేలా వాళ్ల పరువును రోడ్డుకు తెప్పిస్తున్నారు. 
 
ఈ షో ఎంత దారుణం అంటే టీ.ఆర్.పి రేటింగ్స్ కోసం గొడవలను కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కింద చిత్రీకరిస్తున్నారు. నిజంగా ఈ షోస్ ద్వారా కాపురాలని చక్కబెడుతున్నారన్న విషయాన్ని పక్కన పెడితే ఒక ఇంటి పరువును బజారుకీడుస్తున్నారనే విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదిలావుంటే..రోజా రచ్చబండ షో పై ఒక కామెడీ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమో చూసిన వారందరు నిజంగా ఇలాంటి షోస్ వెనుక ఇంత డ్రామా వుంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు. 

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments