Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌కు నాగ్ కాస్త విరామం, ఆ హీరోకు అవకాశం, ఎవరు?

Webdunia
శనివారం, 3 జులై 2021 (12:42 IST)
బిగ్ బాస్ కంటెస్టెంట్ల కన్నా వారిని నడిపించే బిగ్ బాస్‌కు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ హోస్ట్ అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో బ్యాలెన్స్‌గా అందరితో మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరిని నొప్పించకూడదు.. ఎవరితోను అతిగా మాట్లాడకూడదు. ఎందుకంటే లక్షలాది మంది చూసే ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి.
 
అలాంటి బిగ్ బాస్ షోను సమర్ధవంతంగా నడిపించారు కింగ్ నాగార్జున. తనదైన శైలిలో కంటెస్టెంట్లతో మాట్లాడుతూ ఆయన అందరి మన్ననలను అందుకున్నాడు. హోస్ట్ అంటే ఇలా ఉండాలని నాగ్ నిరూపించాడు. తనకు రాసిచ్చిన స్క్రిప్ట్ కాకుండా సొంతంగాను తనదైన శైలిలో మాట్లాడుతూ అందరిని మెప్పించాడు. 
 
ప్రస్తుతం బిగ్ బాస్ 5 సీజన్ రాబోతోంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ అని అందరూ ఫిక్సయిపోయారు. కానీ సినిమాల్లో బిజీగా ఉన్న నాగ్ ఈసారి హోస్ట్‌గా వ్యవహరించడం కష్టమంటున్నారు నిర్వాహకులు.
 
నాగ్ ప్రస్తుతం సత్తారు డైరెక్టన్లో ఒక సినిమాను, అలాగే కళ్యాణ్ క్రిష్ణ డైరెక్షన్లో బంగార్రాజు సినిమాలలో నటిస్తున్నారు. చాలా బిజీ షెడ్యూల్లో సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హోస్టుగా సమయం కేటాయించడం సాధ్యం కాదంటున్నారు నాగార్జున.
 
అందుకే రానాను హోస్ట్‌గా పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట. రానా ఇప్పటికే నెం.1 యారి షోతో అందరి మన్ననలను అందుకున్నాడు. సినిమాలు ప్రస్తుతం లేవు. అందుకే రానా అయితే కరెక్టుగా సరిపోతారని నిర్ణయించుకుని హోస్ట్‌గా డిసైడ్ చేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments