Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెళ్లాం ఊరెళ్లితే'.. వారింటికి నేను వెళతాననుకున్నారు : జ్యోతి'

శ్రీకాంత్, వేణు, సునీల్ హీరోలుగా నటించిన చిత్రం 'పెళ్ళాం ఊరెళితే'. కుటుంబ హాస్యభరిత చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటి జ్యోతి ఓ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో పెళ్లాం ఊరెళ్లితే వారింటికి వెళ్లే క్యారెక్

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (14:41 IST)
శ్రీకాంత్, వేణు, సునీల్ హీరోలుగా నటించిన చిత్రం 'పెళ్ళాం ఊరెళితే'. కుటుంబ హాస్యభరిత చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటి జ్యోతి ఓ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో పెళ్లాం ఊరెళ్లితే వారింటికి వెళ్లే క్యారెక్టర్ జ్యోతిది. ఈ చిత్రం తర్వాత ఆమె మంచి పాపులర్ అయింది కూడా. ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ షోలో ఓ పార్టిసిపెంట్.
 
ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్‌పై ఆమె స్పందిస్తూ ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో నేను చేసిన పాత్రతో నన్ను అందరూ అపార్థం చేసుకున్నారు. పెళ్లాం ఊరిళితే జ్యోతి ఎంట్రీ ఇస్తుందనే జనాల మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఎవరి పెళ్లా ఊరెళ్లినా వాళ్లింటికి నేను వెళ్లిపోతాననుకున్నారు. జనాలు నన్ను అలా ఊహించుకోవడం చాలా బాధగా అనిపించింది. 
 
ఈ క్యారెక్టర్ నుంచి బయటపడటానికి నెగిటివ్ రోల్స్, కామెడీ రోల్స్ చేయాల్సి వచ్చిందన్నారు. అదేసమయంలో తల్లిదండ్రుల అండ లేకపోయే సరికి నేను ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కానీ, నమ్మించి పెళ్లి చేసుకున్న భర్త నట్టేట ముంచాడు. పెళ్లి తర్వాత 9 నెలలకే బాబు పుట్టాడు. ఆ బాబు గురించి ఆలోచిస్తూ నా భర్తతో చిన్న చిన్న గొడవలు రావడంతో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశాను. 
 
చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా హైదరాబాద్‌కు వచ్చిన నాకు ఏం చేయాలో తెలియలేదు. ఈ క్రమంలో ఇల్లు దొరక్క.. అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాను. నేను చేయని తప్పుకు నా జీవితాన్ని చించిన విస్తరాకులా చేసేశారు. కానీ నా బలం ఏంటంటే నా కొడుకు. ఈ జీవితమే వద్దనుకున్న నాకు కొడుకు రూపంలో దేవుడు బుద్ది చెప్పాడు. అందుకే వాడి కోసమే బతుకుతున్నా. ఎందుకంటే నేను, నా భర్త చేసిన తప్పుకు వాడు అనాథలా మారకూడదు. అని నటి జ్యోతి చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Newly married woman: పెళ్లైన మూడు రోజులకే నవ వధువు మృతి.. ఎలా.. ఏం జరిగింది?

రిజర్వేషన్ వ్యవస్థ అప్‌గ్రేడ్- నిమిషానికి లక్ష కంటే ఎక్కువ టిక్కెట్లు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాఠశాలలకు రూ.45.02 కోట్లు మంజూరు

ప్రైవేట్ బస్సులో నేపాలీ మహిళపై అత్యాచారం... ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments