విజయ్ దేవరకొండ 'నోటా'ను విడుదల కానివ్వం... ఎవరు?

విజయ్ దేవరకొండ తాజా సినిమా 'నోటా' రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. సినిమాను అక్టోబర్ 5న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావించిన చిత్ర బృందానికి విడుదల కాకముందు నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణం అందులో తమిళుల మనోభావాలు దెబ్బతి

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:28 IST)
విజయ్ దేవరకొండ తాజా సినిమా 'నోటా' రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. సినిమాను అక్టోబర్ 5న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావించిన చిత్ర బృందానికి విడుదల కాకముందు నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణం అందులో తమిళుల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు ఉన్నాయట. ఆ సన్నివేశాలు చిత్రం నుంచి తొలగించాల్సిందేననీ, లేదంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామని అన్నాడీఎంకెకు చెందినవారు అంటున్నారట.
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించే ముందు జరిగిన హాస్పిటల్ తతంగాన్ని పోలిన కీలక సన్నివేశం ఉండనున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు ఈ సినిమాకు తలనొప్పిగా మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అటువంటి సీన్ ఏదైనా ఉంటే సెన్సార్ బోర్డ్‌లో దానికి కత్తెర పడే అవకాశం ఉంది.
 
ఇదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలకు సంబంధించిన సీన్లు కూడా ఉన్నాయని సమాచారం. కాబట్టి ఈ సినిమా విడుదలకు ఏదో ఒక అవాంతరం ఏర్పడే అవకాశం ఉంది. అయితే విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి, ద్వారక, గీత గోవిందం సినిమాలకు కూడా ఇలాగే అవాంతరాలు ఏర్పడగా అవి మూడూ మంచి విజయం సాధించాయి. కాబట్టి విజయ్‌కు ఇది కూడా కలిసొచ్చే అంశమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం

Jagan Visits Cyclone areas: కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాను ప్రాంతాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments