Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనపై దాడి జరుగలేదన్న బెల్లంకొండ... అంతా ముని 3 కోసమేనంట...

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:40 IST)
బెల్లంకొండ సురేష్‌ అనగానే... ఆయన గురించి రకరకాలుగా చెబుతుంటారు. ప్రముఖ నిర్మాత.. ఓ దశలో దర్శకుల్ని కూడా స్కూల్‌మాస్టార్‌లా కంట్రోల్‌ చేస్తారనే కామెంట్ ఉంది. రభస దర్శకుడు శ్రీనివాస్‌కు ఈయనకు మధ్య గొడలు జరిగాయి. ఇంకోవైపు ఆయనకు చాలా అప్పులున్నాయనీ, అవి తీర్చాలని ఫైనాన్సియర్లు పట్టుపడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో ఆయనపై దాడి జరిగిందంటూ కొన్ని ఛానల్స్‌ వార్తలు ప్రసారం చేశాయి. ఆయన కారును, ఆఫీసును చూపిస్తూ... తెగ ప్లే చేసేశాయి. 
 
ఎవరో ఆయన కారుకు అడ్డం వచ్చినట్లు, డ్రైవర్‌ గుద్దినట్లు ప్రకటించాయి. అయితే ఇవన్నీ కట్టుకథలే అని ఆయన చెబుతున్నాడు. ఆదివారం నాడు వివరణ ఇచ్చారు. నా ఆఫీస్‌ మీద ఎవరూ దాడి చేయలేదు, అలాగే నా మీద ఎవరూ దాడి చేయలేదు. బయట వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మీడియా వారు ఒక వార్త రాసే ముందు నిజానిజాలు తెలుసుకొని రాయాలని ఆయన అన్నారు.
 
కాగా, తాజాగా ఆయన ముని-3 సినిమాను విడుదల చేయాల్సి ఉంది. దానిపై కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. చేసిన అప్పులు తీర్చమని ఫైనాన్సియర్లు రావడం, దాన్ని ఎలా రిలీజ్‌ చేయాలో తంటాలు పడుతున్న తరుణంలో ఈ సంఘటన జరగడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడులో విడుదల చేశారు. బెల్లంకొండ సురేష్‌ నిర్మాత. తెలుగులో మాత్రం రిలీజ్‌ చేయలేకపోతున్నారు. అందుకే ఇలాంటి డ్రామాను ప్లే చేశారంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments