Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్‌కు చిరు కాంపౌండ్ పిలుపు రావడం లేదట... ఎందుకంటే అందుకేనంట...

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (17:52 IST)
బండ్ల గణేష్ అంటే... సినీ నిర్మాత, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. పవన్‌ కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్‌ సినిమా తీశారు. తను ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమా చేశాడని, బాబు.. అంటూ పవన్‌ను మీడియా ముందు పొగిడేవారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు చిరు కాంపౌండ్‌ నుంచి పలుకరింపే లేదు. దానికి కారణం... ఆయనపై చీటింగ్‌ కేసులు నమోదు కావడమేనని సమాచారం. ముంబైకు చెందిన గుట్కా వ్యాపారి కుమారుడు సచిన్‌ జోషితో... ఆషీకీ చిత్రాన్ని 'నీ జతగా నేనుండాలి' పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ఇక్కడ వ్యవహారాలు సరిగ్గా తెలీని సచిన్‌.. బండ్ల గణేష్‌ను ఆశ్రయించారు.
 
ఆ చిత్రానికి విపరీతంగా ఖర్చుపెట్టించాడనే టాక్ ఆమధ్య వార్తలు వచ్చాయి. చివరికి చిత్రం ఢమాల్‌ అయింది. విడుదల ముందు కొన్ని గొడవలు కూడా జరిగినట్లు ఆమధ్య వాదనలు కూడా వినిపించాయి. ఆర్థిక లావాదేవీల్లో మోసం చేశాడని సచిన్‌కు చెందిన వీకింగ్‌ మీడియా.. గణేష్‌పై కేసు వేసింది. ఇది ఇంకా ఫైనల్‌ కాలేదు.
 
ఇదిలావుండగా, మరో కేసు ఆయన ఎదుర్కొంటున్నారు. పూరీతో టెంపర్‌ సినిమా తీశారు. ఆ సమయంలో ఫైనాన్స్‌ కూడా ఓ కంపెనీ నుంచి తీసుకున్నాడు. అందు నిమిత్తం ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో వారు చీటింగ్‌ కేసు పెట్టారు. దీంతో దాన్నుంచి బయటపడటానికి ప్రముఖ దర్శకుడ్ని సంప్రదించాడు. ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయి. కానీ అనుకున్న టైమ్‌కు క్లియర్‌ చేయకపోవడంతో.. అదికాస్త పెరిగి పెద్దదయింది. ప్రస్తుతం ఆ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, బండ్ల గణేష్‌.. ఏమి చేస్తాడో వేచి చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments