Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్ 'బాహుబలి-2' రిలీజ్ చేస్తే థియేటర్లు తగలబెడతారేమో? : కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ

తెలుగు, తమిళ, మలయాళ డబ్బింగ్‌ సినిమాలకు వ్యతిరేకంగా కన్నడ సినీపరిశ్ర మరోమారు గళమెత్తింది. సినీనటుడు జగ్గేష్‌ చేసిన ట్వీట్‌ ఇందుకు ఆజ్యం పోసింది. డబ్బింగ్‌ చిత్రాలు విడుదల చేస్తే అది ప్రజల్లో ఆగ్రహానిక

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (21:32 IST)
తెలుగు, తమిళ, మలయాళ డబ్బింగ్‌ సినిమాలకు వ్యతిరేకంగా కన్నడ సినీపరిశ్ర మరోమారు గళమెత్తింది. సినీనటుడు జగ్గేష్‌ చేసిన ట్వీట్‌ ఇందుకు ఆజ్యం పోసింది. డబ్బింగ్‌ చిత్రాలు విడుదల చేస్తే అది ప్రజల్లో ఆగ్రహానికి దారితీసి థియేటర్లను తగులబెట్టే పరిస్థితి రావొచ్చంటూ ఆయన హెచ్చరించారు. 
 
ఈ ట్వీట్ కన్నడ సినీపరిశ్రమలో బాంబులా పేలింది. జగ్గేష్‌ వ్యాఖ్యలపై సినీపరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి-2ను కన్నడ భాషలోకి డబ్బింగ్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కథనాల నేపథ్యంలోనే ఈ వివాదం రాజుకోవడం గమనార్హం. 
 
కన్నడ సినీపరిశ్రమలో డబ్బింగ్‌ భూతానికి అనుమతి ప్రశ్నేలేదని కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజ్‌ ప్రకటించారు. కన్నడ సినీపరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉందని డబ్బింగ్‌కు అనుమతి మంజూరు చేస్తే కన్నడ కళాకారులు, నటులు ఎక్కడికి వెళ్ళాలని ఆయన ప్రశ్నించారు. కన్నడిగుల ప్రయోజనాలను కాపాడే దిశలో డబ్బింగ్‌ను అందరూ వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments