Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌పై స్కిట్.. హైపర్ ఆదిని బాలయ్య చంపేస్తానని బెదిరించారా? సారీ చెప్పాక ఏం జరిగింది?

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో సీనియర్ నటులపై కామెడీ స్కిట్‌లు మామూలే. అయితే జ‌బ‌ర్ద‌స్త్ షోలో కామెడీతో విశేషంగా ఆకట్టుకొంటున్న హైపర్ ఆదికి నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల వార్నింగ్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:55 IST)
జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో సీనియర్ నటులపై కామెడీ స్కిట్‌లు మామూలే. అయితే జ‌బ‌ర్ద‌స్త్ షోలో కామెడీతో విశేషంగా ఆకట్టుకొంటున్న హైపర్ ఆదికి నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల వార్నింగ్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం సాగింది. తన తండ్రి, నటరత్న, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తారకరామారావు ప్రతిష్టకు భంగం కలిగించేలా జబర్దస్ ప్రోగ్రామ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదిపై బాలయ్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. 
 
ఓ దశలో ఆదిని చంపేయ్యమంటూ తన పీఏను ఆదేశించినట్లు కూడా వదంతలు వ్యాపించాయి. గతంలో ఆది అభి బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు దివంగ‌త లెజెండ్రీ హీరో ఎన్టీఆర్ పై ఓ స్కిట్ చేశాడ‌ట‌. అందులో పొర‌పాటుగా ఎన్టీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ.. పీఏ చేత ఫోన్ చేయించి ఆదిని చంపేస్తానని బెదిరించాడట. 
 
బాలయ్య పీఏ ఆదితో.. మిమ్మ‌ల్ని చంపమ‌న్నాడు.. చంపేయాలా అని అడిగాడట. దీంతో కంగారు పడిన ఆది అలాంటి త‌ప్పు మరోసారి చేయ‌న‌ని సారీ చెప్పాడ‌ట‌. ఆ త‌ర్వాత బాల‌య్య పీఏ కూడా స‌ర‌దాగా అన్నాన‌ని చెప్ప‌డంతో హైప‌ర్ ఆది కూల్ అయ్యాడట. ఆ దెబ్బతో అగ్రహీరోలతో స్కిట్ రాయడాన్ని జబర్దస్త్ టీమ్ పక్కనపెట్టేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

Jagitial: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి.. బైకర్ కూడా..?

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments