Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మీద బాలయ్య పాట, అదే బర్త్ డే స్పెషల్ గిఫ్టంట

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:05 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న. ఈ సంవత్సరం బాలయ్య 60వ జన్మదినోత్సవం కావడంతో పుట్టినరోజును స్పెషల్‌గా ప్లాన్ చేసారు. అయితే కరోనా కారణంగా పెద్దగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఉండవు అని ప్రచారం జరిగింది కానీ.. తాజా సమాచారం ప్రకారం... బాలయ్య బర్త్ డేను బాగానే ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ... ఓ పాట పాడాను. త్వరలో రిలీజ్ చేస్తున్నాను. చూడండి.. ఆ పాట ఎలా ఉంటుందో అంటూ హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆ పాట ఏంటంటే... కరోనా మీద బాలయ్య పాడారట. ఈ పాటను బాలయ్యతో పాటు లేడీ సింగర్ పాడారని తెలిసింది.
 
బాలయ్య.. బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక సింగర్ సింహా బాలయ్య గురించి చెబుతూ ఓ పాట పాడాడట. జై బాలయ్య.. జై జై బాలయ్యా అంటూ సాగే ఈ పాట బాలయ్య గొప్పతనాన్ని తెలియచేసేలా ఉంటుందట.
 
మరో సర్ ఫ్రైజ్ ఏంటంటే... బాలయ్య గతంలో నర్తనశాల సినిమాను ప్లాన్ చేసారు. హీరోయిన్ సౌందర్య మరణంతో ఆ సినిమాను ఆపేసారు. ఇప్పుడు ఆ ఫుటేజ్ లోంచి కొంత తీసి చిన్న వీడియో రిలీజ్ చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బాలయ్య బాబు 60వ పుట్టినరోజును గట్టిగానే ప్లాన్ చేసారు. ఇక బాలయ్య బాబు అభిమానులకు పండగే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

మూసీ నదిలో నెమ్మదిగా తగ్గిన నీటి మట్టం... ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న జనం

పవన్‌ను కలిసిన చంద్రబాబు.. బాలయ్య కామెంట్స్‌పై చర్చ జరిగిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments