Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌతమీపుత్ర శాతకర్ణి': బాలకృష్ణ హేమమాలినికి ఏమిచ్చాడు.. అదిరిపోయే గిఫ్టిచ్చాడా?

బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇంతవరకూ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చిన క్రిష్,

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (12:59 IST)
బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇంతవరకూ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చిన క్రిష్, ఇక్కడ శాతకర్ణి కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. శాతకర్ణిగా బాలకృష్ణ .. ఆయన తల్లిగా హేమమాలిని .. భార్యగా శ్రియ ఈ షూటింగులో పాల్గొంటున్నారు. 
 
హేమమాలిని తొలి రోజు షూటింగ్‌కి రాగానే.. నందమూరి హీరో ఆమెకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి అబ్బురపరిచారట. తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనే నేసిన "లేపాక్షి'' చీరను హేమమాలినికి బహుమతిగా ఇచ్చారట. ఈ నందమూరి హీరో తనకు ఇచ్చిన ప్రాధాన్యత విలువ చూసి.. ఆ బాలీవుడ్ నటి ఆనందానికి అవధులు లేవట. 
 
అంతే కాదు.. గతంలో తాను నందమూరి తారకరామారావు ఎన్టీఆర్‌తో కలిసి రెండు సినిమాలు చేసినప్పటి సంగతులను కూడా గుర్తుచేసుకున్నారట. ఎన్టీఆర్‌తో కలిసి ''పాండవ వనవాసం'', ''శ్రీకృష్ణ విజయం'' చిత్రాల్లో నటించారు హేమమాలిని. ఆ రెండు పౌరాణికాలు కాగా.. ఇప్పుడు మళ్లీ రాజుల కాలానికి సంబంధించిన చిత్రంలో ఈమె తిరిగి తెలుగులో నటిస్తుండడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లోను 2017 సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments