Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య స్పీడుకి కుర్ర హీరోలు వెనకబడిపోతున్నారా?

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (19:26 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కరోనా కారణంగా ఆగిన తర్వాత రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. ఈ రెండు పాత్రలు వేటికవే వైవిధ్యంగా ఉంటాయని తెలిసింది.
 
2021 సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే... ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. 
 
సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కథ విని బాలయ్య ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బోయపాటితో చేస్తున్న మూవీ కంప్లీట్ అయితే.. బి.గోపాల్‌తో మూవీ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపించింది.
 
తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో బాలయ్య మూవీ కన్ఫర్మ్. పూరి ఫైటర్, బాలయ్య బోయపాటి సినిమా పూర్తైతే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... రైటర్ ఎం. రత్నం బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేసారట.
 
 ఈ కథ విని బాలయ్య ఓకే చెప్పారని... ఈ మూవీకి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. ఇలా బాలయ్య తదుపరి చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి. మరి.. ఎవరికి ఓకే చెబుతాడో.? ఎవరి సినిమా ముందు స్టార్ట్ చేస్తాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments